బైక్ టైర్ పేలి... యువకుడు స్పాట్ డెడ్

by srinivas |   ( Updated:2024-12-29 03:00:29.0  )
బైక్ టైర్ పేలి... యువకుడు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా గోనెగండ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో బైక్ టైర్ పేలి యువకుడు మృతి చెందారు. మృతుడు పెద్దనేలటూరుకు చెందిన గోరంట్లగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గోరంట్ల భార్య ఫిర్యాదుతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు రూల్స్ కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed