దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ : ఎమ్మెల్యే కోరం కనకయ్య

by Aamani |
దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ :  ఎమ్మెల్యే కోరం కనకయ్య
X

దిశ,టేకులపల్లి : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ స్వర్గీయులైనందున వారి చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌ 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు.

విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారు.దేశానికి ఆయన చేసిన సేవ,ఆయన రాజకీయం జీవితం,వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ఆయన మృతి దేశానికి తీరని లోటు.భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్ ను మనస్ఫూర్తిగా నిజమైన నివాళులర్పిస్తున్నాను అని కోరం కనకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బండ్ల రజిని, మండల అధ్యక్షుడు దేవా నాయక్ మండల నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, పోశాలు,బండ్ల శ్రీను,లక్ష్మయ్య, సంజయ్, సర్దార్, శివ, ఉండేటి ప్రసాద్, భానోత్ రవి,బద్రు, చందర్ సింగ్ నాగేశ్వరరావు, నరసయ్య, వెంకన్న, కృష్ణార్జున రావు, హనుమంతు,శివాజీ, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed