- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: వర్చువల్‌గా కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్.. అసలు విషయం అదే!
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరికొద్దిసేపట్లో వర్చువల్‌గా నాంపల్లి కోర్టు (Nampally Court)కు హాజరుకానున్నారు. మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరు తరువాత కోర్టులో ప్రాసెస్ ఉన్నందున ఆయన లీగల్ టీం ఇవాళ ఉదయం 11.30కి కోర్టుకు హాజరుకాబోతున్నారు. అయితే, అల్లు అర్జున్ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన తరఫు న్యాయవాదులు ఆన్‌లైన్ ద్వారా వర్చువల్‌గా కోర్టుకు హాజరు అవుతారని కోర్టును రిక్వెస్ట్ చేశారు. అందుకు జడ్జి సమ్మతించడంతో అల్లు అర్జున్ వర్చువల్‌గా కోర్టుకు హాజరుకానున్నారు. కాగా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు (Chikkadapally Police) అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. అల్లు అర్జున్ హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు.
అయితే, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో నాంపల్లి కోర్టు (Nampally Court) అల్లు అర్జున్‌కు రిమాండ్ విధించింది. నేటితో 14 రోజుల రిమాండ్ గడువు ముగినుండటంతో హైకోర్ట్ నుంచి తనకు మధ్యంతర బెయిల్ మంజూరయిందని తెలియజేసేందుకు ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రానున్నారు. ఆయన తరఫు న్యాయవాదులు వెంట వచ్చి ఆ ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నారు. అదేవిధంగా ఇప్పటికే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్‌పై మెజిస్ట్రేట్ విచారణ చేపట్టనున్నారు. తొలుత అల్లు అర్జున్ కోర్టుకు రాబోతున్నారనే సమాచారంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, చివరి నిమిషంలో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరు అవుతుండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read More ...
'పుష్ప-2' కలెక్షన్ల సునామీ.. ఆగని రికార్డుల మోత.. ఎంత కలెక్ట్ చేసిందంటే..?(పోస్ట్)