Cyber Crime: ఓ చానల్ అధినేత బీఆర్ నాయుడుపై ఫిర్యాదు

by srinivas |   ( Updated:2024-12-27 05:39:25.0  )
Cyber Crime: ఓ చానల్ అధినేత బీఆర్ నాయుడుపై ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ఛానల్ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu)పై సైబర్ క్రైమ్‌(Cybercrime)కు లాయర్ ఇమ్మానేని రామారావు(Lawyer Immaneni Rama Rao) ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించడంపై ఆయన అభ్యంతరం వ్యకత్తం చేశారు. చట్టవిరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని ఆరోపించారు.ఈ మేరకు ఛానల్ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్ పాటు లేడీ యాంకర్‌పై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో రామారావు ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న ఓ కార్యక్రమం ప్రసారం సందర్భంగా కోర్టు, జడ్జిలు, లాయర్లపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, న్యాయవాదుల అస్తిత్వాన్ని కించపరిచేలా విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేయడంపైనా సీరియస్ అయ్యారు. అది కోర్టు ధిక్కరణేకాక, సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే ధిక్కరణలపై కఠిన చర్యలు తీసుకోవాలని లాయర్ ఇమ్మానేని రామారావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed