- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ATM Charges: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్..ఈ పనులు చేస్తే ఛార్జీల మోత మోగుడే

దిశ, వెబ్ డెస్క్ : ATM Charges: మే 1 నుండి ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపునకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఒక నెలలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ATM లావాదేవీలు చేసే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ఇక నుంచి ఇతర బ్యాంకు ఏటీఎంల నుండి నగదు తీసుకోవడానికి రూ.19 బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి రూ.7 ఛార్జీ విధించనుంది.
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు, డిజిటల్ పేమెంట్లు ఎంత పెరిగినా క్యాష్ తప్పనిసరి అవసరమే. చాలా మంది ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్నారు. ఇకపై ఏటీఎంల నుంచి క్యాష్ డ్రా చేసినప్పుడు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్పులను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం..కస్టమర్లకు నెలకు ఐదు ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్ డ్రా చేయడానికి ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ఈ ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజులు త్వరలోనే పెరగనున్నాయి.
ప్రస్తుతం నెలకు 5సార్లు ఏటీఎంల నుంచి ఫ్రీగా క్యాష్ విత్ డ్రా చేసుకున్నాక..ఆ తర్వాత విత్ డ్రా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి బ్యాంకులు రూ. 21వసూలు చేస్తాయి. కొత్త నివేదిక ప్రకారం చూస్తే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఫీజును రూ. 22కి పెంచాలని నిర్ణయించింది. దీంతో ఈ మేరకు ప్రతి ట్రాన్సాక్షన్స్ పై వినియోగదారులకు అదనపు భారం పడుతుంది. డబ్బు డ్రా చేయడానికి మరొక బ్యాంకు ఏటీఎంను ఉపయోగించినప్పుడు మీ బ్యాంక్ చెల్లించేదే ఇంటర్ చేంజ్ ఫీజు.
ప్రస్తుతం ఈ ఫీజు క్యాష్ విత్ డ్రాలకు రూ. 17 ఇతర ట్రాన్సాక్షన్స్ కు రూ. 6 గా ఉంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫీజు రూ. 19కి, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ ఫీజు రూ. 7కి పెంచాలని ఎన్ పీసీఐ సూచించింది. బ్యాంకులు ఈ ఖర్చులను కస్టమర్లకు బదిలీ చేస్తాయి. కాబట్టి వేరే బ్యాంకు ఏటీఎంను ఉపయోగించినప్పుడు కస్టమర్లు ఇకపై డబ్బు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
గత రెండేళ్లలో ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఏటీఎంల నిర్వహణ ఖర్చు భారీగా పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావంతో దాదాపు అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఏటీఎంలో క్యాష్ రీఫిల్ చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే బ్యాంకులు నియమాలు, నిబంధనలు పాటించడానికి కూడా ఎక్కువ చెల్లిస్తున్నాయి. దీన్ని అధ్యయనం చేసేందుకు ఆర్బిఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అదనపు ఖర్చులను కవర్ చేసేందుకు ఫీజులు పెరగాలని కమిటీ అంగీకరించింది.
ఈ మార్పు పెద్ద నగరాలను మాత్రమే ప్రభావితం చేయదు. వైట్ లేబుల్ ఏటీఎంలను నడుపుతున్నవారు, ఏటీఎం ఆపరేటర్లు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నారు. అంటే చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు కూడా క్యాష్ డ్రా చేసినప్పుడు ఎక్కువ ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ఛార్జీల పెంపుపై ఆర్బిఐ, ఎన్ పీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు.