- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భారీ ఏర్పాట్లు
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో వచ్చే జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshanam)ఏర్పాట్లపై టీటీడీ(TTD) సన్నద్ధమైంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో శ్రీధర్‌తో కలిసి టీటీడీ విభాగాధిపతులతో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు తగిన ఉత్తర్వులు జారీ చేశారు. 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70,000 పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన పది రోజుల శ్రీవాణి టికెట్లను అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. 300 రూపాయల స్పెషల్ ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు 40 వేల టికెట్ల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను జనవరి 10నుంచి 19వ తేదీ వరకు తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా టికెట్లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఈ దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతిస్తారు.
తిరుపతిలోని జీవకోన, రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి, ఇందిరా స్టేడియం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లను జారీ చేయనున్నారు. టోకెన్లు ఇచ్చేటువంటి కేంద్రాల వద్ద శ్రీవారి భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టికెట్లు లేని భక్తులను క్యూలైన్లలోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 4.45 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం కార్యక్రమం జరగుతుంది.
ఆ రోజు ఉదయం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు' చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుతో పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేశారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికారులు సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గం.ల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ప్రతిరోజూ అందుబాటులో మూడున్నర లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నారు. అదనంగా మరో 3.50 లక్షల ప్రసాద లడ్డూలను బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగు నీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ చేస్తారు.