వైసీపీ నిరసన.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి సెటైర్లు

by srinivas |
వైసీపీ నిరసన.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ చేసిన పాపాలు నేటికీ రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జిల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన వ్యక్తం చేయడంపై ఆయన సెటైర్లు వేశారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరుగునట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన చార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య అని వ్యాఖ్యానించారు. APERC అనుమతించిన దాని కన్నా రూ. 19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా ? అని మంత్రి ప్రశ్నించారు. యూనిట్ రూ.5 ల కే వచ్చే విద్యుత్ ని కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో రూ.8 నుంచి రూ.14 కి కొనుగోలు చేసింది జగన్ కాదా? అని నిలదీశారు. జగన్ తన అవినీతిని ప్రజలపై సర్దుబాటు ఛార్జీల రూపంలో భారం మోపేందుకు నాడే APERC అనుమతి కోరింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతి, ధన దాహం వల్లే ప్రజలపై విద్యుత్ భారం పడిందని ఆరోపించారు. ఇవ్వన్నీ తెలిసి కూడా దొంగే దొంగ అన్నట్టు జగన్ తీరు ఉందన్నారు. పవర్ చార్జీలు పెంచినందుకే జగన్‌కి ప్రజలు పవర్ పీకేశారన్న విషయం జగన్ తెలుసుకోవాలని సూచించారు. ఇకనైనా ప్రజలను జగన్ మోసం చేయడం మానుకొని వాస్తవాలు గ్రహించాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు

Advertisement

Next Story

Most Viewed