- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసంగి పంటకు సాగు నీరు అందిస్తాం
దిశ, ఖానాపూర్ : వేసంగి రబీ పంటలకు సాగునీరు అందిస్తామని, రైతులు ఎవరూ కూడా ఆందోళన పడొద్దని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, జన్నారం రైతులతో ఇరిగేషన్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన వేసంగి సాగునీటి సరఫరాపై ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో కడెం ప్రాజెక్టు మరమ్మతులకు చిల్లిగవ్వ ఇవ్వలేదని, దాని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ద చూపి కడెం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.9 కోట్ల 46 లక్షలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు కడెం ప్రాజెక్టు సురక్షితంగా ఉందని అన్నారు. ఖానాపూర్, కడెం దస్తురాబాద్, జన్నారం రైతులకు వేసంగి పంట సాగుకు నిరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎమ్మెల్యే అన్నారు. జనవరి 5వ తేదీ నుండి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.