- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు వెడల్పులో సర్వం కోల్పొతున్న ఇళ్ల బాధితులు
దిశ,కేసముద్రం: కేసముద్రం స్టేషన్ నుంచి విలేజ్ దర్గా వరకు అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం శ్రీకారం చుట్టారు. గురువారం ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు 80 ఫీట్ల విస్తీర్ణంతో రోడ్డుకు ఇరువైపులా సెంటర్ నుండి ఆటో 40 ఇటు 40 ఫీట్లతో గోడలకు అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. ఈ క్రమం లో రోడ్డు వెడల్పుతో ఇండ్లు కోల్పోతున్నామని కేసముద్రం విలేజ్ కూ చెందిన మహిళలు రోడ్డు పైకి చేరి 60 ఫీట్ల రోడ్డు నే నిర్మించాలని ధర్నాకు దిగారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మేము ఇండ్లు పూర్తిగా కోల్పోతున్నామని మేము కూలీనాలీ చేసుకుని బతికే వాళ్ళం తప్ప మాకు ఎలాంటి ఆధారం లేదని 20 ఫీట్ల రోడ్డు వెడల్పులో మాకు ఏమీ మిగలడం లేదని మేము నిలువు నీడ లేకుండా ఎలా బ్రతకాలని మేము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి కేసముద్రం స్టేషన్ నుండి విలేజ్ లో రోడ్డు వెడల్పు 60 ఫీట్లకే కుదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా మహిళలు కోరుతున్నారు.