- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాయితీగా వ్యాపారాలు చేయండి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పిల్లలమర్రి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మాడ్రన్ ఐస్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోకుండా నిజాయితి,నమ్మకంతో కూడిన వ్యాపారం చేస్తే లాభాలతో సిరులు కురిపిస్తూ..ఆ వ్యాపారం ఎల్లకాలం నిలబడుతుందని ఆయన అన్నారు.
ప్రజాపాలనలో తమ ప్రభుత్వం విద్య,వైద్యం,ఉపాధి,వ్యవసాయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మథర్సా ఇస్లామియా కాషిఫ్ ఉల్ ఉలూమ్ సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఆయన ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ..చాలా నిబద్ధతతో కూడిన విద్యాభివృద్ధికి పాటుపడుతున్న ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయని,ఇటువంటి సంస్థల్లో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు,అవసరమైన కంప్యూటర్లు లాంటి సహాయ సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్,మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,వైస్ చైర్మెన్ షబ్బీర్ అహ్మద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ విజయ్ కుమార్,టిపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్,మధుసూధన్ రెడ్డి,ఇమ్రాన్,తఖీ,నసీబ్ ఖాన్,మోయిజ్,శ్రీనివాస్ యాదవ్,ఇద్రూస్ తదితరులు పాల్గొన్నారు.