High Court : ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం

by M.Rajitha |
High Court : ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన పోలీస్ ఉనతాధికారి భుజంగరావు(BhujangaRao) హైకోర్టు(High Court)లో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు కోర్టులో విచారణకు వచ్చింది. కేసు కీలక దశలో ఉందని, బెయిల్ ఇవ్వడం వలన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలియజేశారు. అందువలన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు పూర్తయ్యాక.. కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. భుజంగరావు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ముఖ్య నాయకుల, వారి బంధువుల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని బయటికి రావడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరికొంతమంది విదేశాలకు పారిపోయారు.

Advertisement

Next Story

Most Viewed