అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

by Naveena |
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 26: నిజామాబాద్ నగరంలోని లలితామహల్ థియేటర్ పక్కనున్న అక్షిత పకోడ షాప్ ఎదుట ఓ వ్యక్తి మద్యం సేవించి చనిపోయినట్లు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ తెలిపారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవుపల్లి గ్రామానికి చెందిన మాగిడి కృష్ణ అనే వ్యక్తి గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగి పడిపోయేవాడు. ఈనెల 24న కృష్ణ బోర్ రిపేర్ చేస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లలేదు. గురువారం ఉదయం సుమారు 9 గంటలకు కృష్ణ మృతదేహం లలిత మహల్ థియేటర్ సమీపంలో కనిపించిందని ఎస్ ఐ తెలిపారు. మృతుడి బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి మృతుడిని గుర్తించడంతో..మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్ లోని మార్చురీకి తరలించారు. మృతుడి భార్య భాగ్య త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed