SA Vs PAK : తొలి టెస్ట్ బంతికే వికెట్.. సౌతాఫ్రికా బౌలర్ అరుదైన రికార్డ్

by Sathputhe Rajesh |
SA Vs PAK : తొలి టెస్ట్ బంతికే వికెట్.. సౌతాఫ్రికా బౌలర్ అరుదైన రికార్డ్
X

దిశ, స్పోర్ట్స్ : టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలో వేసిన తొలి బంతికే వికెట్ తీసి సౌతాఫ్రికా బౌలర్ కర్బిన్ బాస్చ్ అరుదైన రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ప్రొటియస్ బౌలర్ గురువారం ఈ ఘనత సాధించాడు. 15 ఓవర్లో బౌలింగ్ వేసేందుకు దిగిన కర్బిన్ తొలి బంతికే మసూద్‌ను ఔట్ చేశాడు. ఇప్పటి వరకు మొత్తం 25 మంది బౌలర్లు ఈ ఫీట్ సాధించారు. 2024లోనే మూడు సార్లు ఈ ఘనతను బౌలర్లు సాధించారు. జనవరిలో అడిలైడ్‌ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ వికెట్‌ను తీసి షమర్ జోసెఫ్ ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాడు కాన్వేను సౌతాఫ్రికాకు చెందిన మొరెకి తొలి బంతికే ఔట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 211 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 15.2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది.

Advertisement

Next Story

Most Viewed