- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushya Pournami: పుష్య పౌర్ణమి.. ఆ రోజున ఈ పనులు చేస్తే.. గ్రహాలతో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి!
దిశ, వెబ్ డెస్క్ : పుష్య మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమిని పుష్య పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజున చంద్రుడుసంపూర్ణ రూపంలో కనిపిస్తాడు. పుష్య పూర్ణిమ రోజున దేవుడికి పూజ చేసి, దానం చేస్తుంటారు. ముఖ్యంగా కాశీ, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లలో గంగాస్నానం చేస్తుంటారు.
పుష్య పూర్ణిమ
పుష్య పూర్ణిమ 2025 జనవరి 13 ఉదయం 4:32 గంటలకు ప్రారంభమయ్యి జనవరి 14 తెల్లవారుజామున 3:41 గంటలకు ముగుస్తుంది.
ఈ వస్తువులను దానం చేయండి
ఈ రోజున సూర్య దేవునితో పాటు చంద్రుడిని పూజించాలి. పుష్య పూర్ణిమ రోజున, భక్తులు బ్రహ్మముహూర్తంలో గంగాస్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే పేదలకు దానం చేస్తే వారి జీవితంలో ఉన్న సమస్యలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున బెల్లం, నువ్వులు, దుస్తులు దానం చేయడం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఇలా చేయడం వలన పాపాలు పోవడమే కాకుండా, ఇంట్లో శాంతి ఉంటుంది. ఇంకా రాహువు , శని గ్రహాలతో ఉన్న సమస్యలు తొలగి మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.