ఉత్తమ చిత్రాల నిర్మాణంపై మురళీమోహన్ షాకింగ్ కామెంట్స్

by srinivas |   ( Updated:2024-12-26 16:22:22.0  )
ఉత్తమ చిత్రాల నిర్మాణంపై మురళీమోహన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తమ చిత్రాల నిర్మాణంపై నటుడు మురళీమోహన్(Actor Murali Mohan) షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ(Telangana)లో పుష్పా 2 సినిమా(Pushpa 2 movie), సంధ్య థియేటర్ తొక్కిసలాట, టికెట్స్ రేట్స్ పెంపు, బెనిఫిట్ షో అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో చర్చించిన అనంతరం ఆయన ఓ మీడియా ఛానల్ డిబెట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ టికెట్ ధరలు, షోల పెంపు లేకపోతే ఉత్తమ చిత్రాలు తీయడం కష్టమేనన్నారు. ప్రపంచ స్థాయి చిత్రం నిర్మించాలంటే ఖర్చు తప్పదన్నారు. సినిమా రిలీజ్ అయిన వారంలోనే పెట్టిన ఖర్చును రాబట్టుకోవాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీల్లోనూ బెనిఫిట్ షోలు ఉన్నాయని మురళీమోహన్ గుర్తు చేశారు.

బెనిఫిట్ షోలు ప్రదర్శించకపోతే నిర్మాణ ఖర్చు పెట్టలేడని మురళీమోహన్ వెల్లడించారు. తొలి షోకే సినిమా యూనిట్ వెళ్లకపోతే మూవీని అంచనా వేయలేమని తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన బాధాకరమన్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వాన్ని కూడా సినీ ప్రముఖులు కలుస్తారని తెలిపారు. నంది అవార్డుల(Nandi Awards)పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌(Deputy Cm Pawan Kalyan)తో చర్చించాలని చెప్పారు. కళాకారుడికి ప్రభుత్వ గుర్తింపు ముఖ్యమని, డబ్బు కాదన్నారు. సినీ ఇండస్ట్రీ సమస్యలను తెలంగాణ సీఎంకు వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించారని నటుడు మురళి మోహన్ పేర్కొన్నారు.

Read More...

CM Revanth Reddy: ‘ఆ ప్రచారం నమ్మొద్దు.. పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?’


Advertisement

Next Story

Most Viewed