Manmohan Singh: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దార్శనికుడు మన్మోహన్

by Shiva |
Manmohan Singh: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దార్శనికుడు మన్మోహన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల నెరవేరింది నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలోనే సోనియాగాంధీ కమిటీని నియమించారు. ఆ కమిటీ తెలంగాణ కాంగ్రెస్​నేతల అభిప్రాయాలను విన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ఎందుకు అవసరం అనే అంశాన్ని వివరించడానికి ప్రొఫెసర్​జయశంకర్​ఎంచుకుని ఆయనకు వివరించారు. ఆ తరువాతే ఆయనే ప్రధానమంత్రి కావడం, తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చడం, ఆ తరువాత ప్రణబ్​ ముఖర్జి నేతృత్వంలో కమిటీని వేయడం, చిదంబరం ప్రకటన ఇవ్వన్ని కూడా మన్మోహన్​ సింగ్​ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి.

మన్మోహన్ ప్రధాని‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రీయ ప్రారంభంమైంది. రాజ్యసభలో ఆమోదానికి ముందు అప్పటి బీజేపీ నేతలు అరుణ్​ జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుపడుతున్నప్పుడు.. ఏపీకి ప్రత్యేక హాదా హామి ఇచ్చి.. ఇప్పటికిప్పుడు బిల్లులో ప్రత్యేక హోదా చేర్చితే ఆ బిల్లు కాస్తా ఆర్థిక బిల్లుగా మారి మళ్లీ లోక్​సభకు వెళ్లాల్సి వస్తుందని, అంత సమయం లేదని, ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. దానితో ఆయన రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయి తెలంగాణ రాష్ట్రం సిద్దించింది.

చివరిసారి తెలంగాణకు వచ్చింది అప్పుడే..

మన్మోహన్ సింగ్ చివరి సారిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014 ఏప్రిల్ 26న భువనగిరిలో కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మన్మోసింగ్​ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్​ లేకుంటే సాధ్యం కాకపోయేదని ఆ సభలో ప్రసంగించారు. అంతుకు మందు ప్రధాని అధికారిక హోదాలో 2013 ఫిబ్రవరి 24కు తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. దేశ వ్యాప్తంగా నేటికి ప్రజల ఆధరణ పొందుతున్న పథకంగా ఉపాధి హామీ ఉంది. ఈ పథకాన్ని మొదట తీవ్ర కరువు దుర్భర పరిస్థితి ఉండే ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మన్మోహన్​సింగ్​ ప్రారంభించారు. ఈ పథకం ఇప్పటికీ నిరుపేదలకు బుక్కెడు బువ్వను పెడుతుంది.

జయశంకర్ ​సార్‌తో..

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ కారులతో మన్మోహన్ సింగ్ కు అవినాభావ సంబంధాలున్నాయి. తెలంగాణ సిద్దాంత కర్త ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ కు మన్మోహన్ సింగ్ కు సన్నిహితంగా ఉండేవారు. మన్మోహన్​ సింగ్​ యూజీసీ చైర్మన్​గా కూడా పనిచేశారు. మన్మోహన్​యూజీసీ చైర్మన్​గా ఉండగా ప్రోఫెసర్ జయశంకర్ ఇండియన్​ఫారన్​లాంగ్వేజస్​యూనివర్సిటి(ఇఫ్లూ) కు రిజిస్ట్రార్​గా పనిచేశారు. ఇది సెంట్రల్​ యూనివర్సిటి. దీంతో ఈ యూనివర్సిటికి నేరుగా యూజీసీతో సంబంధాలు ఉండేవి. దీంతో ప్రొఫెసర్​ జయశంకర్​ మన్మోహన్​ సింగ్​ను పలు మార్లు కలిసి యూనివర్సిటికి సంబంధించిన అనేక అంశాలను చర్చించారు. ఈ సంబంధాలు కొన్ని దశాబ్దాల తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో మళ్లీ కలిశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రధానిగా ఉన్న మన్మోహన్​సింగ్​కు వివరించడానికి తనకు ఎంతగానో దోహదం చేశాయని పలు మార్లు జయశంకర్​ సార్​చెప్పే వారు.

పీవీ అంత్యక్రియలకు హాజరు..

తాను ప్రధాని అయినా కూడా తనకు హోదా, గుర్తింపు రావడానికి ప్రధాన కారణమైన పీవీ నరసింహరావు పట్ల చివరి వరకు కృతజ్ఞతను వ్యక్తం చేశారు. పీఎం హోదాలో పీవీ నరసింహరావు అంత్యక్రియలకు హైదరాబాద్‌కు వచ్చి హాజరై నివాళులర్పించారు.

Advertisement

Next Story

Most Viewed