- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rain Alert: తెలుగు రాష్ట్రాలను బిగ్ అలర్ట్.. రాబోయే 48 గంటల్లో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
దిశ, వెబ్‌డెస్క్: నైరుతి బంగాళాఖాతం (Southwest Bay of Bengal)లో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని.. ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో గురువారం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఐఎండీ (IMD) తెలిపింది. అదేవిధంగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణ (Telangana)లో మంగళవారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. ముఖ్యంగా ములుగు, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. బుధవారం ఉదయం నుంచే తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని దట్టమైన మేఘాలు కమ్మేసి ముసురు ముంచేస్తోంది. ఈ ప్రభావంతో నగరవాసులు బయటకు వెళ్లలేని పరిస్థిలులు నెలకొన్నాయి. మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇలానే ఉంటుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.