- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: మరికొద్దిసేపట్లో సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. హాజరయ్యేది వీరే!
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 (Pushpa) విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమ మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇవాళ ఇండస్ట్రీ ప్రముఖులు టీఎఫ్‌డీసీ (TFCD) చైర్మన్ దిల్ రాజ్ (Dil Raju) నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. ఇందుకు వేదికగా కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) వేదిక కానుంది. ఈ సమావేశానికి మా అసోసియేషన్, ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్ నుంచి 36 మంది హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వారిలో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ హాజరుకానున్నారు.
ఇక హీరోల నుంచి వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలజీ సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ భేటీలో బెనిఫిట్ షోలు (Benefit Shows), టికెట్ ధరల (Ticket Prices) పెంపుపై వారు ఏం చెప్పబోతున్నారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదేవిధంగా రాయితీలు, సౌకర్యాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి విన్నవించనున్నారు. కాగా, సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటన తరువాత సినీ ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం వైఖరి మారింది. రాయితీలు ఇచ్చేందుకు రేడీగా అంటూ కండీషన్లు పెట్టారు. తాను సీఎంగా ఉన్నంత కాలం ప్రత్యేక సౌకర్యాలు కుదరవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు. ఈ క్రమంలో నేడు జరగబోయే భేటీకి ప్రాధాన్యత నెలకొంది.