- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుపాయల చెక్ డ్యామ్ లో మునిగి వ్యక్తి మృతి..
by Kalyani |
X
దిశ, పాపన్నపేట : ప్రమాదవశాత్తు ఏడుపాయల చెక్ డ్యామ్ లో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. హవేలీ ఘనపూర్ మండలం కూచన్పల్లి కి చెందిన కొజ్జాపురం వెంకటి (43) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం విందు నిమిత్తం ఏడుపాయలకు కుటుంబీకులతో కలిసి వచ్చారు. కుటుంబీకులు చెక్ డ్యామ్ సమీపంలో టెంట్ వేసుకొని వంటలు చేస్తుండగా వెంకటి స్నానం చేసేందుకు చెక్ డాం వద్దకు వెళ్లాడు. స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కుటుంబీకులు విషయం తెలుసుకొని గజ ఈతగాల్లతో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Advertisement
Next Story