ఆ బాధ్యతలు తీసుకోండి: శివ చరణ్​ రెడ్డికి ఐవైసీ లేఖ

by srinivas |
ఆ బాధ్యతలు తీసుకోండి: శివ చరణ్​ రెడ్డికి ఐవైసీ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంటనే బాధ్యతలు తీసుకోవాలంటూ శివ చరణ్​ రెడ్డిని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ భాను చిబ్ జక్కిడి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రత్యేకంగా ఆయనకు లేఖ రాశారు. తెలంగాణ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకొని పార్టీ కోసం పుల్ టైమ్ కేటాయించి వర్క్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో కీలకమైన యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని పనిచేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వర్క్ చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed