- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సర్కార్‌పై రాహుల్ గాంధీ ప్రసంశలు..వెరీ గుడ్ అంటూ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేస్తూ లేఖ రాశారు. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బుధవారం రాసిన లేఖలో హామీలను నేరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కాంగ్రెస్ విజన్ ముందుకు తీసుకువెళ్తూ.. పేదల పట్ల పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని చాటుతూ తమరు నిరంతరం కృషి చేస్తారని తాను ఆశిస్తున్నట్లు లేఖలోరాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు సైతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాసి వారికి అభినందనలు తెలిపారు. ఈ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ... రాహుల్ నాయకత్వంలో ఏడాది పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ దార్శనిక నాయకత్వంలో విజయవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో తమ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని, పేదలకు ప్రభుత్వ ఫలాలను అందిచడమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన ప్రతిస్పందన లేఖలో పొన్నం తెలిపారు.