- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరింత తీవ్రమైన మినీ అంగన్వాడీల సమస్యలు.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: మినీ అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ మినీ అంగన్వాడీల సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియ పూర్తిగా అమలులోకి రాలేదని, జనవరి నెల నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రధాన అంగన్వాడీ టీచర్లతో సమానంగా రూ.13,650 వేతనాలు చెల్లించడం ప్రారంభించినప్పటికీ, మార్చి నెల నుంచి మళ్లీ పాత వేతనం రూ.7,800 మాత్రమే అందించడంలో అసమతుల్యత నెలకొందని దీనివల్ల మినీ అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుని, సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. మినీ అంగన్వాడీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు వేతనాలు సమానంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, కాలేరు వెంకటేష్, నాయకులు రాంబాబు, రవీందర్ సింగ్ తదితరులున్నారు.