చలికాలం ఎఫెక్ట్.. తగ్గిన విద్యుత్ డిమాండ్

by Mahesh |
చలికాలం ఎఫెక్ట్.. తగ్గిన విద్యుత్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. చలికాలం నేపథ్యంలో వాడకం తగ్గడంతో డిమాండ్ తగ్గింది. తెలంగాణలో గతేడాది ఇదే రోజు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 8426 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. కాగా ఆదివారం సాయంత్రం 7:54 గంటల వరకు ఈ వినియోగం 6650 మెగావాట్లుగా ఉంది. కాగా ఎస్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 6118 మెగావాట్ల వినియోగం జరిగగా.. ఆదివారం నాటికి అది 4990 మెగావాట్లుగా ఉంది. అలాగే ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 2107 మెగావాట్లు ఉండగా ఆదివారం నాటికి ఇది 1552 మెగావాట్లు గా నమోదైంది. ఇదిలా ఉండగా తెలంగాణలో గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో అత్యధిక డిమాండ్ 15,370 మెగావాట్ల వినియోగం జరిగింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 20 న 15,570 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక గరిష్ట వినియోగంగా నమోదైంది. ఇదిలా ఉండగా డిస్కంలు మాత్రం ఎంత పీక్ డిమాండ్ అయినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed