- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన మొదటి రోజు ఐపీఎల్ మెగా వేలం.. టాప్ ధర పలికి ప్లేయర్లు వీరే
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో పాటు స్టార్ ప్లేయర్లు, యువ ఆటగాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐపీఎల్ మెగా వేలం మొదటి రోజు విజయవంతంగా ముగిసింది. ఈ వేలంలో భారత యువ ప్లేయర్లు, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడు పోయారు. వేలానికి ముందు అత్యధిక జట్లు విదేశీ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడంతో.. మొదటి రోజు వేలంలో భారత యువ ప్లేయర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో రిషబ్ పంత్ ను లక్నో జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. అలాగే మరో యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలవగా.. యువ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లకు అమ్ముడు పోయి.. అత్యధిక ధర పలికిన మూడో భారతీయ ప్లేయర్ గా నిలిచాడు. అలాగే పలువురు ప్లేయర్లను వారి బేస్ ప్రైజ్ కు కూడా ఎవరు కొనుగోలు చేయలేదు. ఇదిలా ఉంటే ఈ వేలంలో పలువురు యువ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు భారీ జాక్ పాట్ కొట్టారు.
టాప్ ధర పలికిన ప్లేయర్లు వీరే..
1. రిషబ్ పంత్ .. ₹27,00,00,000 లక్నో సూపర్ జెయింట్స్
2. శ్రేయాస్ అయ్యర్.. ₹26,75,00,000 పంజాబ్ కింగ్స్
3. వెంకటేష్ అయ్యర్ ₹23,75,00,000.. కేకేఆర్
4. అర్షదీప్ సింగ్ ₹18,00,00,000 (RTM).. పంజాబ్ కింగ్స్
5. యుజ్వేంద్ర చాహల్.. ₹18,00,00,000.. పంజాబ్ కింగ్స్
6. జోస్ బట్లర్.. ₹15,75,00,000.. గుజరాత్ టైటాన్స్
7. KL రాహుల్.. ₹14,00,00,000 ఢిల్లీ క్యాపిటల్స్
8. ట్రెంట్ బౌల్ట్ ₹12,50,00,000.. ముంబై ఇండియన్స్
9. జోఫ్రా ఆర్చర్ .. ₹12,50,00,000 రాజస్థాన్ రాయల్స్
10. జోష్ హాజిల్‌వుడ్.. ₹12,50,00,000 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
11. మహ్మద్ సిరాజ్ ₹12,25,00,000.. గుజరాత్ టైటాన్స్
12. మిచెల్ స్టార్క్.. ₹11,75,00,000.. ఢిల్లీ క్యాపిటల్స్
13. ఫిల్ సాల్ట్.. ₹11,50,00,000 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
14. ఇషాన్ కిషన్ ₹11,25,00,000.. సన్ రైజర్స్ హైదరాబాద్
15. మార్కస్ స్టోయినిస్.. ₹11,00,00,000 పంజాబ్ కింగ్స్
16. జితేష్ శర్మ.. ₹11,00,00,000 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
17. టి. నటరాజన్.. ₹10,75,00,000 ఢిల్లీ క్యాపిటల్స్
18. కగిసో రబాడ.. ₹10,75,00,000.. గుజరాత్ టైటాన్స్
19. నూర్ అహ్మద్.. ₹10,00,00,000, చెన్నై సూపర్ కింగ్స్
20. మహ్మద్ షమీ.. ₹10,00,00,000 సన్‌రైజర్స్ హైదరాబాద్