- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US SEC : విదేశీయులకు నేరుగా సమన్లు.. అమెరికా ఎస్‌ఈసీకి నో పవర్
దిశ, నేషనల్ బ్యూరో : సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు అదానీ గ్రూప్(Adani Group) రూ.2,200 కోట్ల ముడుపులు ఇచ్చిందనే అభియోగాలపై అంతటా చర్చ జరుగుతోంది. ఈ అభియోగాలతో అమెరికాలో ఇటీవలే కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ(Gautam Adani), ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (US SEC) సమన్లు పంపింది. వాస్తవానికి ఒక విదేశీయుడికి అమెరికా ఆ విధంగా నేరుగా సమన్లు జారీ చేయలేదు. అమెరికా నుంచి గౌతమ్ అదానీ, సాగర్ అదానీల ఇంటి అడ్రస్‌లకు సమన్ల నోటీసులను పంపితే అవి చెల్లవని విదేశీ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. ఆ సమన్లను భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన చట్టపరమైన మార్గాల ద్వారానే కేసులతో సంబంధమున్న వారికి అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఈక్రమంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అమెరికా న్యాయశాఖ సంప్రదించవచ్చు. భారత రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్తలు అందించే సూచనల ప్రకారం ఈ సమన్ల జారీ విషయంలో ప్రొసీడ్ కావచ్చు. ‘ది హేగ్ కన్వెన్షన్ 1965’, ‘మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ’ అనే రెండు ఒప్పందాలు గతంలో భారత్-అమెరికా మధ్య జరిగాయి. ఇలాంటి అరుదైన సందర్భాల్లో ప్రొసీడ్ అయ్యేందుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల గురించి ఆ ఒప్పందాల్లోనూ ప్రస్తావన ఉంది. మొత్తం మీద అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్‌ఈసీ) అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, ఇదే నగరంలో సాగర్‌కు చెందిన బోదక్‌దేవ్ నివాసానికి సమన్లు పంపింది. వీటిని అందుకున్న 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో అమెరికా ఎస్‌ఈసీ ప్రస్తావించింది. ఈ సమన్లలోని ఆదేశాల అమలుకు దోహదపడే చట్టపరమైన, దౌత్యపరమైన మార్గాలను తదుపరిగా అమెరికా న్యాయశాఖ అన్వేషించనుందని సమాచారం.