Maha Yuti : త్వరలోనే ‘మహాయుతి’లోకి ఎంవీఏ ఎమ్మెల్యేలు : ఎన్‌సీపీ చీఫ్ విప్

by Hajipasha |
Maha Yuti : త్వరలోనే ‘మహాయుతి’లోకి ఎంవీఏ ఎమ్మెల్యేలు : ఎన్‌సీపీ చీఫ్ విప్
X

దిశ, నేషనల్ బ్యూరో : అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ (NCP) చీఫ్ విప్ అనిల్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ‘మహా వికాస్ అఘాడీ’ (MVA) కూటమిలో అలజడి ఉందని.. త్వరలోనే దాని నుంచి ఐదారుగురు ఎమ్మెల్యేలు మహాయుతి(Maha Yuti) కూటమిలో చేరడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. శరద్ పవార్ ఎన్‌సీపీ, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా తిరిగి ఎన్నికైన వారిలో చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని అనిల్ పాటిల్ వెల్లడించారు.

ఎంవీఏతో ఇక తమకు భవిష్యత్తు లేదని ఆందోళనకు గురవుతున్న పలువురు ఎమ్మెల్యేలు మహాయుతిలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అధికార పార్టీతో చేతులు కలపడం తప్ప మరో మార్గం లేదన్నారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లోగా చాలామంది ఎంవీఏ కూటమిలోని ఎమ్మెల్యేలు మహాయుతిలోకి జంప్ చేస్తారని అనిల్ పాటిల్ కామెంట్ చేశారు.

Next Story

Most Viewed