- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రాష్ట్రంలో ఇది పరిస్థితి.. ఫోన్లు ఇంతలా వాడుతున్నారా?’.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్(Mobiles) వినియోగం ఎంతలా పెరిగిపోయిందో గమనిస్తూనే ఉన్నాం. స్మార్ట్‌పోన్స్(Smart Phone) అందరీ జీవితంలో అంతర్భాగమైపోయాయి అనడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుత కాలంలో పెద్దవారే కాదు చిన్న పిల్లలు కూడా మొబైల్స్‌కి బానిస అవుతున్నారు. ఆనాటి రోజుల్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చి బయట ఆడుకోవడానికి వెళ్లే వారు కానీ.. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫోన్‌లోనే గడుపుతున్నారు. ప్రస్తుతం విద్య, డిజిటల్ లావాదేవీలకు మొబైల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తుంది. అయితే మొబైల్స్ పై ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణ(Telangana)లో జనాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయంట. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్-2024) సెప్టెంబర్ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు, మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 4.4 కోట్లు, ల్యాండ్‌లైన్ వినియోగదారుల సంఖ్య15.25 లక్షలుగా పేర్కొంది.
ట్రాయ్ నివేదిక ప్రకారం..
కేవలం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య= గ్రామాల్లో 39%, పట్టణాల్లో 60 శాతం
మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య=గ్రామాల్లో 41%, పట్టణాల్లో 59%
ల్యాండ్‌లైన్ వినియోగదారుల్లో =గ్రామాల్లో 4%, పట్టణాల్లో 96%
అయితే.. రాష్ట్ర వైర్‌లెస్ టెలీ డెన్సిటీ(Wireless Teledensity) 105.32 శాతంగా ఉంది. అంటే సగటున ప్రతి 100 మందికి 105కి పైగా మొబైల్ ఫోన్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ అంశంలో దేశవ్యాప్తంగా తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గోవా-152, కేరళ-115, హర్యానా 114 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుత ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. ఈ తరుణంలో సర్వే ప్రకారం తెలంగాణలో మొబైల్ వాడకం ఎక్కవగా ఉండటం.. రాష్ట్ర ప్రజలు కమ్యూనికేషన్, టెక్నాలజీకి ఎంత ప్రయారిటీని ఇస్తున్నారో తెలుస్తోంది.