USAID: యూఎస్ఏఐడీ నిధుల ఎఫెక్ట్.. ప్రతిరోజూ 2000 హెచ్ఐవీ కేసులు నమోదు !

by vinod kumar |
USAID: యూఎస్ఏఐడీ నిధుల ఎఫెక్ట్.. ప్రతిరోజూ 2000 హెచ్ఐవీ కేసులు నమోదు !
X

దిశ, నేషనల్ బ్యూరో: విదేశాలకు సహాయం అందించే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (USAID) నిధులను నిలిపివేస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం ఇప్పటికే వివిధ సంస్థలపై కనపడుతోంది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితికి చెందిన ఎయిడ్స్ ఎజెన్సీ (యూఎన్ ఎయిడ్స్) కీలక విషయాన్ని వెల్లడించింది. యూఎస్ఏఐడీ నిధులు ఆపివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ 2000 కొత్త హెచ్ఐవీ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బ్యానిమా ( Winnie Byanyima) సోమవారం జెనీవాలో విలేకరులతో మాట్లాడారు. ‘యూఎస్ఎయిడ్ ఫండ్స్ ఆగిపోతే కొత్తహెచ్ఐవీ కేసులు భారీగా నమోదవుతాయి. అంతేగాక రాబోయే నాలుగేళ్లలో 6.3 మిలియన్ల ఎయిడ్స్ మరణాలు సంభవిస్తాయి’ అని హెచ్చరించారు.

ఈ సంక్షోభాన్ని నివారించడానికి అమెరికా సహాయాన్ని పునరుద్ధరించాలని సూచించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాల నిమిత్తం ఫండ్స్ అందకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మహమ్మారి తిరిగి పుంజుకుంటుందని అంచనా వేశారు. 2023లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని గుర్తు చేశారు. మరిన్ని నిధులు అండకపోతే ఇది పది రెట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 1990, 2000 సంవత్సరంలో ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మానవుల ప్రాణాలను ఆపగలిగే నిధులను ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సేవలను తక్షణమే పునరుద్ధరించాలని సూచించారు.

Next Story

Most Viewed