- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మైనర్ ను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

దిశ, ఎర్రుపాలెం: ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్బవతిని చేసి మొహం చాటేసిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎర్రుపాలెం ఎస్సై పి.వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని భీమవరం హరిజనవాడ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను(17) అదే గ్రామానికి చెందిన ముల్లంగి జమలయ్య(27) పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. నిందితుడు తన తల్లిదండ్రులతో కలిసి ఓ ఆర్ఎంపీ సాయంతో ఏపీలోని విజయవాడలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అబార్షన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గమనించిన బాలిక వారి నుండి తప్పించుకొని ఇంటికి చేరింది. తన బంధువుల సాయంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు జమలయ్య పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.