- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్.. చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు..

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ మ్యాచ్ లు నడుస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ యాప్ లను కొంత మంది బోకీలు సోషల్ మీడియా వేదికగా నడిపిస్తున్నారు. ముక్కు మొహం తెలియని బోకీలు వివిధ యాప్ ల పేరిట ఆన్ లైన్ బెట్టింగ్ లకు పాల్పడుతూ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. గతంలో ఎల్లారెడ్దిపేట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసినప్పటికీ బెట్టింగ్ బంగారు రాజులు బయపడతలేరు. ఒక వైపు పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కల్పించినా బెట్టింగ్ బాబులలో తేడా రావడం లేదు. ఎల్లారెడ్డిపేట మండలంలో చిరువ్యాపారులతో సహా బడా వ్యాపారులు సైతం బెట్టింగ్ లకు పాల్పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. పైసా పైసా పోగు చేసి కాయకష్టం చేసి చదివించిన పిల్లలు బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇటీవల ఎల్లారెడ్దిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ ఎల్లారెడ్దిపేటలో పాల డైరీ నిర్వహణ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు అప్పుల పాలు కావడంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. దీంతో కుటుంబం రోడ్డున పడింది.
ఆన్ లైన్ బెట్టింగ్ లపై సమాచారం ఇవ్వండి ఎస్సై నేరెళ్ల రమాకాంత్...
ఎల్లారెడ్దిపేట మండలంలో ఎక్కడైనా ఎవరైనా ఎంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఆన్ లైన్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్దిపేట ఎస్ఐ నేరెళ్ల రమాకాంత్ దిశతో అన్నారు. ఐపీఎల్ బెట్టింగ్ పై నేరుగా డయల్ 100 కి ఫోన్ చేయాలని లేదా నేరుగా ఎస్ఐ సెల్ నంబర్ 8712656374 కి సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.