Living Grave: ఏపీలో వినూత్న ఘటన.. జీవ సమాధికి వ్యక్తి యత్నం

by Shiva |
Living Grave: ఏపీలో వినూత్న ఘటన.. జీవ సమాధికి వ్యక్తి యత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: పూర్వం కాలజ్ఞాన రచయిత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (Potuluri Veerabrahmendra Swamy) జీవ సమాధి అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక గ్రామాల్లో కొంతమంది సర్కస్ ఆడించే వారు జీవ సమాధి అంటూ ఓ పెద్ద గోయ్యిలోకి వెళ్లి కొన్ని గంటల పాటు అక్కడే ఉంటూ సహసాలు చేయడం మనం అరుదుగా చూసే ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశం జిల్లా (Prakasam District) తాళ్లూరు (Thallur) మండల పరిధిలోని విఠలాపురం (Vithalapuram)లో వనూత్న ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కైపు కోటిరెడ్డి (Kaipu Kotireddy) అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఇంటి ఆవరణలో ఐదు అడుగల లోతు గొయ్యి తీసి ఒంటిపై నూలు పోగు లేకుండా జీవ సమాధికి వెళ్లాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కోటిరెడ్డిని సమాధి నుంచి తిరిగి బయటకు తీసుకొచ్చారు. అసలు ఎందుకు జీవ సమాధికి వెళ్తున్నావని వారు కోటిరెడ్డిని ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానానికి పోలీసులు అవాక్కయ్యారు. తన పేరు భూదేవి పుత్రుడని, ప్రపంచ శాంతి కోసమే తాను జీవ సమాధి దీక్ష చేపట్టానని కోటిరెడ్డి చెప్పాడు. దీంతో అతడికి పోలీసులు కౌన్సెలింగ్‌తో పాటు మరోసారి అలా చేయకూడదంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story