- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు:టీటీడీ అదనపు ఈవో

దిశ, రాజంపేట: ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఒంటిమిట్టలో జరుగుతున్న పనులను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. ఏప్రిల్ 5వ తేదీ నుండి 15 వ తేదీ వరకు జరగనున్న శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు 5వ తేదీ అంకురార్పణ జరుగనుందని తెలియజేశారు. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి జరుగనుండగా, 11వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
టిటిడి లోని వివిధ విభాగాల అధికారులు ప్రణాళిక బద్దంగా పనులు చేస్తున్నారని వివరించారు. 2015 నుండి ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ సీతారాముల వారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు.
కళ్యాణ వేదిక వద్ద భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలోను, ఆలయ పరిసర ప్రాంతాల్లో మరింత ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణ, భక్తులు వీక్షించేలా ఎల్ ఈడీ స్క్రీన్ లను, అన్నప్రసాదాల పంపిణీ, భక్తులకు స్వామి వారి తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలియజేశారు. అంతకుముందు అదనపు ఈవోకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అటు తర్వాత ముఖ్యమంత్రివర్యులు వచ్చే మార్గాలను, ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక, క్యూలైన్లు, భక్తులకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. అటు తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శ్రీ శేషా రెడ్డి, విజిఓలు శ్రీ రామ్ కుమార్, శ్రీమతి సదాలక్ష్మి, అన్నప్రసాద విభాగం ప్రత్యేకాధికారి శ్రీ జీవిఎల్ ఎన్ శాస్త్రి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.