నిస్వార్ధ రాజకీయ నేత జే. కృష్ణారావు : జయప్రకాశ్​ నారాయణ

by Aamani |
నిస్వార్ధ రాజకీయ నేత జే. కృష్ణారావు : జయప్రకాశ్​ నారాయణ
X

దిశ, కూకట్​పల్లి : నిస్వార్థ రాజకీయాలలో సేవలు అందించిన జే. కృష్ణారావు చరిత్రలో నిలిచి పోయారని లోక్​సత్తా అధినేత, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్​ నారాయణ అన్నారు. కేపీహెచ్​బీ కాలనీ ఇతిహాస్​ హోటల్​లో సోమవారం నిర్వహించిన కూకట్​పల్లి నియోజకవర్గం లోక్​సత్తా నాయకులు జే. కృష్ణారావు సంతాప సభలో జయప్రకాష్​ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జే. కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయప్రకాష్​ నారాయణ మాట్లాడుతూ జే. కృష్ణారావు అధ్యాపకునిగా, సామాజిక స్పృహ గల లోక్​సత్తా కార్యకర్తగా అందరికి సుపరిచితుడని అన్నారు.

జే. కృష్ణారావు మార్గదర్శకుడిగా మాత్రమే కాకుండా, ఆశ కాంతి నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు, జే. కృష్ణారావు కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు, కళ్యాణి, సురేందర్ రావు, మాలతి, మాజీ కార్పొరేటర్ జి. వెంగళరావు, లోక్ సత్తా నాయకులు శ్రీనివాసన్, ఉపేంద్ర, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి, యువికె. రాజు, పుల్లారెడ్డి, శ్రీనివాస్, కృష్ణ భగవాన్, కట్టా నర్సింగరావు, సాంబయ్య, కోటేశ్వరరావు, జర్నలిస్టు సంఘం నాయకులు ఎం. హేమ సుందర్, ఆర్​కే. దయ సాగర్, నాగరాజు యాదవ్, బి. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story