ఏప్రిల్ చివరిలోగా కేసులు పరిష్కరించాలి..

by Naveena |
ఏప్రిల్ చివరిలోగా కేసులు పరిష్కరించాలి..
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలోని ఆయా ప్రభుత్వ శాఖలో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులను పెండింగ్ లో ఉంచకుండా పూర్తిస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్ గురువారం జిల్లా పర్యటనలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీవో ఖుష్బూ గుప్తా, ఏ ఎస్పీ కాజల్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్,డి ఎఫ్ ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్,డీఎస్పీ జీవన్ రెడ్డి లు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ల్యాండ్ సర్వీస్ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక నిది అట్రాసిటీ,ఆర్ ఓ ఆర్ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్నమైన రీతిలో అభివృధ్ధి పథంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాను ముందుకు తీసుకువెళుతున్నారని,అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ ,ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించినా ఆయన,ఆయా శాఖలలో ఎస్సీ, ఎస్టీ కేసులు,శాఖలలో ఖాళీల వివరాలు, తదితర అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా గుడిహత్నూర్ మండలంలో జరిగిన సంఘటన చాలా భాదాకరమని,ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శాఖల వారిగా కమిషన్ చైర్మన్ కు అధికారులు పీపీటీ ద్వారా వివరించారు.

సమావేశ అనంతరం ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్,కే.నీలాదేవి, లక్ష్మీనారాయణ , తదితరులను కలెక్టర్‌ ఘనంగా స‌త్క‌రించారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు ఆర్ ఓ ఆర్ సమస్యల గురించి సమీక్షలో దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి,ఆర్డీవో వినోద్ కుమార్,జిల్లా అధికారులు,జిల్లా సహకార అధికారి బి.మోహన్,జిల్లా ఏడిసిసి బ్యాంక్ లిమిటెడ్ ఆదిలాబాద్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శ్రీధర్ రెడ్డి,బ్యాంకు డైరెక్టర్లు, బ్యాంకు జి ఎం,డి జి ఎం, ఏ జి ఎం లు,వివిధ సహకార సంఘాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed