తిరుమల భక్తులకు చంద్రబాబు శుభవార్త... త్వరలో వాట్సాప్ సేవలు !

by Veldandi saikiran |
తిరుమల భక్తులకు చంద్రబాబు శుభవార్త... త్వరలో వాట్సాప్ సేవలు !
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల ( Tirumala ) శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Cm Chandrababu). తిరుమల శ్రీవారి భక్తుల కోసం వాట్సప్ సేవలు ( WhatsApp services ) త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటన చేశారు. తిరుమలలో గల ప్రతి సేవపై భక్తుల ఫీడ్ బ్యాక్.. తమకు అందేలా... త్వరలోనే వాట్సప్ సేవలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇవాళ సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పై ( TTD ) సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు కూడా సీఎం చంద్రబాబు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవ స్థానం సేవలు, సౌకర్యాలలో 100% మార్పు కనిపించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుమలలో సేవలు బాగుంటే.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా గుర్తు చేశారు. అభివృద్ధి పనుల పేరుతో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదని.. హెచ్చరించారు. వచ్చే 50 సంవత్సరాల వరకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం మండలిని ( Tirumala Tirupati Devasthanam ) తీర్చిదిద్దాలని కూడా సూచించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి మెరుగైన సేవలు అందించాలన్నారు. అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని ఇంకా కూడా కొనసాగించకూడదని హెచ్చరించారు. త్వరలో JEO, CVSO, SVBC చైర్మన్, BIRRD డైరెక్టర్‌ ల నియామకం ఉంటున్నారు. ప్రక్షాళన వందశాతం జరగాల్సిందే...ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవన్నారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్‌ క్యాంప్ నిర్మాణం ఉంటుందని చెప్పారు. 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

Next Story

Most Viewed