యాక్షన్‌లోకి దిగిన మార్కెటింగ్ శాఖ.. వివాదం ఇప్పట్లో సద్దుమణిగేనా...?

by Aamani |
యాక్షన్‌లోకి దిగిన మార్కెటింగ్ శాఖ.. వివాదం ఇప్పట్లో సద్దుమణిగేనా...?
X

దిశ, కంటోన్మెంట్ : బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, పాలక మండలిల మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు.ఇరు వార్గాలను శాంతింప చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ జోక్యం చేసుకున్న...ఒకరిపై మరొకరు పెత్తనం సాధించేందుకు ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరం చేసినట్లు సమాచారం. మార్కెట్ కార్యాలయం ముందు పార్క్ చేసిన కారును అక్కడి నుంచి తీయాలని సూచించినందుకు సెక్యూరిటీ గార్డు చరణ్ పై మార్కెట్ కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు సోమదేవేందర్ రెడ్డి దాడి చేసిన విషయం విదితమే.ఈ గోడవ కాస్త పెద్దదై అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబుల మధ్య తీవ్ర ఆగాదాన్ని సృష్టించింది.

వ్యాపారులపై యాక్షన్ షూరు..

సెక్యూరిటీ గార్డు విషయంలో చైర్మన్ ఆనంద్ బాబు, వ్యాపారుల సంఘం ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డిల మధ్య ముదిరిన వివాదం రాజుకుంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డులో అక్రమ వ్యాపార దందాపై కొరఢ ఝుళిపించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా తమ షాపులను ఇతరులకు అద్దెలకిస్తున్నారని 120 మందికి పైగా వ్యాపారులకు శనివారం నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా షాపులను అద్దెలకు తీసుకుని అక్రమంగా వెజిటేబుల్ బిజినెస్ చేస్తున్నారనే నెపంతో పలువురి కాంటాలను మార్కెటింగ్ శాఖ స్వాధీనం చేసుకుంది.

అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇరువర్గాలను కాంప్రమైజ్ చేయిస్తానని హామీ ఇచ్చినా.. సెక్యూరిటీ గార్డు చరణ్ పై దాడి చేసిన సోమదేవేందర్ రెడ్డి పై కేసు నమోదు చేసిన తిరుమలగిరి పోలీసులు శనివారం విచారణ చేపట్టడం చర్చనీయాంశమైంది.ఇకపోతే దేవేందర్ రెడ్డితోపాటు ఆయనకు సహకరించిన వ్యాపారులపై మరో కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది.శుక్రవారం చైర్మన్ ఆనంద్ బాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సమయంలో శ్రీ గణపతి ఆలయంలో సోమ దేవేందర్ రెడ్డి తో పాటు పలువురు వ్యాపారులు ఛైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేవాలయంలో నిబంధనలను ఉల్లంఘించి మార్కెట్ చైర్మన్ ను దూషించి మాట్లాడడం పట్ల తిరుమలగిరి పోలీసులకు మరో కంప్లైంట్ వెళ్లింది. అయితే దేవేందర్ రెడ్డితోపాటు ఆయనకు సహకరిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇద్దరు ఇద్దరే..

కారు పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ గార్డు చరణ్ పై సోమ దేవేందర్ రెడ్డి దాడి చేయడాన్ని పలువురు వ్యాపారులతో పాటు హామాలీలు, ట్రాలీ డ్రైవర్లు తప్పు పడుతున్నారు. ఈ విషయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉండాల్సిందని పేర్కొంటున్నారు.సుధీర్ఘకాలం మార్కెట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న దేవేందర్ రెడ్డి మార్కెట్ కార్యాలయంలో అధికారుల ముందు మరోసారి కొట్టడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మార్కెట్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సెక్యూరిటీ గార్డుపై దాడి ఘటనపై వ్యాపారులను పిలిచి మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ లను బయటపెట్టాలని ఆదేశించడం సమర్ధనీయం కాదంటున్నారు.

వ్యాపారులతో మాట్లాడేటప్పుడు బెదిరించడం..రెచ్చగొట్టే పద్ధతిలో కాకుండా సమన్వయం పాటించి,పెద్దన్న పాత్రలో సమస్యను సానుకూలంగా పరిష్కరించాల్సి ఉండాల్సిందంటున్నారు. ప్రస్తుతం కమిషన్ ఏజెంట్ల ప్రెసిడెంట్ సోమదేవేందర్ రెడ్డి సహనం కోల్పోవడం ఒక ఎత్తైతే... చైర్మన్ ఆనంద్ గౌడ్ సమయస్పూర్తితో వ్యవహారించకపోవడంవల్ల తెలంగాణ లో అతి పెద్దదైన బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ యార్డులో యుద్ధ వాతావరణం నెలకొంది.ఇప్పకైనా ప్రభుత్వ పెద్దలు కలుగు జేసుకోని సమస్యను పరిష్కరించకపోతే మున్ముందు వ్యాపారులు జంట నగరాల మార్కెట్ ల బంద్ కు పిలువునిచ్చే అవకాశం ఉంది.అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులపై కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉక్కుపాదం మోపె అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed