AIని మించి టెక్నాలజీ.. త్వరలోనే అందరికి అందుబాటులోకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!

by D.Reddy |
AIని మించి టెక్నాలజీ.. త్వరలోనే అందరికి అందుబాటులోకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. రోజువారి జీవితాన్ని మరింత సులభతరం చేయటంతో అన్ని రంగాల్లో దీని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ ఆధునిక ప్రపంచంలో ఏఐయే ఓ విప్లవాత్మకమైన మార్పు అనుకుంటే.. తాజాగా అంతకుమించిన టెక్నాలజీ వచ్చేసింది. అదే మివి ఏఐ (Mivi AI). మరీ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదివేయండి.

హైదరాబాద్‌కు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ కంపెనీ మివి (Mivi) వాయిస్ ఆధారిత ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని 'మివి ఏఐ' పేరుతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ ఫౌండర్లు విశ్వనాథ్ కందుల, మిధుల దేవభక్తుని వెల్లడించారు. ఇప్పటి వరకు మనం ప్రశ్నలు టైప్‌ చేస్తే, దానికి సమాధానాలు అక్షర రూపంలో రావటం చూస్తున్నాం. అయితే, ఈ మివి ఏఐ టూల్.. మనుషుల్లా ఆలోచించి సంభాషించగలదు. అంతేకాదు, సంక్లిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు సిట్యువేషన్‌ను బట్టి ఇమిడియెట్‌గా రియాక్ట్ అవుతుందని తెలిపారు. ఇందులో ఉపయోగించిన NLP (నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌) మానవుల భావోద్వేగాలను అర్థం చేసుకుని, అందుకు తగినట్లుగా సమాధానాలు ఇస్తుందన్నారు.

ఇక ఈ టూల్‌ ఆధారంగా కంపెనీ ఇప్పటికే ఏఐ ఇయర్‌ బడ్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఈ బడ్స్‌ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటి ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా రూ.10,000 కంటే తక్కువగానే నిర్ణయించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏఐ బడ్స్‌ను చెవిలో పెట్టుకుని తోటి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడి మన ప్రశ్నలు, సందేహాలు అన్నిటికీ సమాధానాలు రాబట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే ఈ ఏఐ బడ్స్‌ లభిస్తాయి. త్వరలో దీన్ని అన్ని భారతీయ భాషలకు విస్తరించనున్నారు.

Next Story