గత ప్రభుత్వ బాధితుడైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా.. సీఎం చంద్రబాబు భరోసా

by Ramesh Goud |
గత ప్రభుత్వ బాధితుడైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా.. సీఎం చంద్రబాబు భరోసా
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వ బాధితుడైన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు మార్గం చూపిస్తామని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా (Palnadu District), మాచర్ల నియోజకవర్గం (Macharla Constiency), ఆత్మకూరు (Athmakur) గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి (MLA Julakanti Bramhananda Reddy) నేతృత్వంలో ఆదివారం సీఎం చంద్రబాబు ని కలిశారు.

వీరంతా వైసీపీ ప్రభుత్వం (YCP Government)లో పార్టీకి అండగా ఉంటూ వైసీపీ నేతల దాడుల (YCP Leaders Attacks)కు గురైన బాధితులకు ఎమ్మెల్యే జూలకంటి చంద్రబాబుకు తెలియజేశారు. ఈ సందర్భంగా బాధితులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు పడ్డ కష్టాలను సీఎంకు వివరించారు. అలాగే వైసీపీ నేతలు తమతో పాటు తమ ఇళ్లపై దాడులు చేసి ఆర్థికంగా దెబ్బతీశారని వాపోయారు. బాధితుల కష్టాలు విన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతలు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, ఇల్లు లేనివారికి స్థలం కేటాయించి ఇంటిని నిర్మించి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంతేగాక ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యే మార్గం చూపిస్తామని సీఎం హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed