Encounter : పట్టపగలే నడిరోడ్డుపై ఎన్కౌంటర్.. ఇంతకీ అతడు చేసిన తప్పేంటి?

by M.Rajitha |
Encounter : పట్టపగలే నడిరోడ్డుపై ఎన్కౌంటర్.. ఇంతకీ అతడు చేసిన తప్పేంటి?
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka)లో ఓ ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో నిందితున్ని పోలీసులు ఎన్కౌంటర్(Hubballi Encounter) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుబ్బళ్ళిలో ఇంటిముందు ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిని స్థానికంగా కూలీ పనులు చేసుకునే పాట్నాకు చెందిన నితీశ్ కుమార్ కిడ్నాప్ చేశాడు. పాప కనిపించక పోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా.. అక్కడే ఉన్న ఓ పాడుబడిన భవనంలోని బాత్రూమ్ లో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చిన్నారి చనిపోయినట్టు ప్రకటించారు. పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుణ్ణి పట్టుకొని విచారణకు తరలిస్తుండగా.. పోలీసులపై తీవ్ర దాడికి దిగాడు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినా నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. నిందితుడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.



Next Story

Most Viewed