ఆ విషయంపై బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం.. టీపీసీసీ నేత కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-04-02 15:11:49.0  )
ఆ విషయంపై బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం.. టీపీసీసీ నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హెచ్‌సీయూ భూముల (HCU Lands) విషయంలో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లు సోషల్ మీడియా (Social Media)లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ (TPCC General Secretary Charan Koushik Yadav) ఆరోపించారు. గాంధీ భవన్ (Gandhi Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియాను వాడుకొని తెలంగాణలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ (Indhira Gandhi) తెలంగాణకు సెంట్రల్ యూనివర్సిటీ (Central University)ని కేటాయించడం జరిగిందని, ముందుగా గోల్కొండ కోట సమీపంలో భూ కేటాయింపు జరిగినా.. యూనివర్సిటీ కొరకు ఆ భూమి సరిపోదనే ఉద్దేశంతో మళ్లీ కంచె గచ్చిబౌలి ప్రాంతంలో భూ కేటాయింపు జరిగిందని తెలిపారు. భూమిని కేటాయించారు. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీయూకి భూ బదలాయింపు చేయలేదని చెప్పుకొచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రెండవ సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 534 ఎకరాల భూమిని విభజించి, శేరిలింగంపల్లి ఎమ్మార్వో (Sherilingampally MRO)కు బదాలయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు.

ఆ భూమి నుంచి 400 ఎకరాలు ఐఎంజీ స్పోర్ట్స్ కి దారాదత్తం చేసే ప్రయత్నం చేయగా.. అనంతరం ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) ఆ కేటాయింపును రద్దు చేయడం జరిగిందన్నారు. దీనిపై ఐఎంజీ సంస్థ కోర్టును ఆశ్రయించిందని, కానీ ఈ కేసును గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పట్టించుకోకపోవడం వల్ల అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దీనిపై కోర్టులో పోరాడితే.. సుప్రీంకోర్డు ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానిది అని తీర్పునివ్వడంతో ప్రభుత్వం ఆ భూమిని టీజీఐఏసీకి కేటాయించిందని తెలిపారు. కానీ ఇది సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి అని బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని, ఆ భూమిపై తప్పుడు ప్రచారాలు చేసి, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed