Megastar Chiranjeevi: విశ్వంభర సెట్‌లో మెగాస్టార్.. ఆ నటుడితో ఉన్న ఫొటో వైరల్

by sudharani |
Megastar Chiranjeevi: విశ్వంభర సెట్‌లో మెగాస్టార్.. ఆ నటుడితో ఉన్న ఫొటో వైరల్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ఇందులో ‘విశ్వంభర’ (Vishwambhara) ఒకటి. వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ బ్యూటీ త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషికా రంగనాథ్ (Ashika Ranganath), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదాలు పడుతూ వస్తోంది. అలాగే చిరంజీవి కూడా రీసెంట్‌గా ‘మెగా 157’ అనౌన్స్ చేసి.. అందులో యాక్టీవ్‌గా కనిపించడంతో ‘విశ్వంభర’ సైడ్‌కు వెళిపోయినట్లు భావించారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘విశ్వంభర’ సెట్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు నటుడు ప్రవీణ్ (Praveen) కూడా ఉన్నాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియా(Social media)లో షేర్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్స్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రజెంట్ ఈ ఫొటోస్ వైరల్ కావడంతో.. మెగాఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అన్నీ అనుకున్న టైమ్‌కు కంప్లీట్ అయితే.. విశ్వంభర మూవీ ఈ ఏడాది వినాయక చవితి స్పెషల్‌గా ఆగస్టు 22న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు టాక్.

Next Story

Most Viewed