- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నలుగురు పిల్లల గొంతు కోసి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి

- ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం
- మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోపి షాజహాన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి నలుగురు పిల్లల గొంతు కోసి చంపేశాడు. అనంతరం సదరు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకరాం.. మన్‌పుర్ చచారి గ్రామానికి చెందిన రాజీవ్ (36) దంపతులకు స్మృతి (13), కీర్తి (9), ప్రగతి (7), రిషబ్ (5) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. రాజీవ్‌తో గొడవపడిన భార్య మంగళవారం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక బుధవారం రోజు ఎప్పటిలాగే రాజీవ్ తన నలుగురు పిల్లలతో కలిసి ఇంట్లో పడుకున్నాడు. రాజీవ్ తండ్రి పృథ్విరాజ్ పక్కన ఉండే ఇంట్లో ఉంటాడు. గురువారం ఉదయం పృథ్విరాజ్ నిద్రలేచి రాజీవ్‌ను పిలిచినా పలకలేదు. ఇంటి తలుపు కొట్టి చూడగా లోపటి నుంచి గడియ వేసి ఉంది. దీంతో పృథ్విరాజ్ ఇంటి పైకప్పు నుంచి లోపలికి వెళ్లిచూడగా.. పిల్లల మృతదేహాలు రక్తపు మడుగులో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పక్క గదిలో రాజీవ్ ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, రాజీవ్‌కు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయమైందని, అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నాడని రాజీవ్ తండ్రి పృథ్విరాజ్ చెప్పాడు. ప్రమాదం జరిగిన నాటి నుంచి మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నాడని.. ఎప్పుడూ కోపంగా ఉండేవాడని అన్నాడు. దీంతో భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు సహజంగా మారినట్లు చెప్పాడు. అయితే కోడలు పుట్టింటికి వెళ్లడంతో తానే ఉదయం పూట చాయ్ పెట్టి పిల్లలకు ఇచ్చేవాడినని.. గురువారం కూడా టీ పెట్టిన తర్వాత పిలిస్తే పలకలేదని అన్నాడు.
కాగా, పోలీసులకు సంఘటనా స్థలంలో పదునైన ఆయుధం లభించింది. దీన్ని సానబెట్టేందుకు సాండ్ పేపర్‌ను ఉపయోగించాడని.. అది కూడా ఘటనా స్థలంలో లభ్యమైందని పోలీసులు తెలిపారు.