తుఫాన్ బీభత్సం.. మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం

by Sridhar Babu |
తుఫాన్ బీభత్సం.. మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం
X

దిశ, కాగజ్నగర్ రూరల్ : కాగజ్‌నగర్ మండలం అంకోడ గ్రామంలో వర్షం, పెనుగాలులతో కూడిన తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో రైతు లావుడే దేవాజీ సాగుచేసిన మూడు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా నేలకూలిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట ఒక్కసారిగా నేలరాలిపోవడం చూసి రైతు కన్నీరు మున్నీరయ్యాడు. మొక్కజొన్నతోపాటు వరి పంట కూడా దెబ్బతిన్నది. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన స్థానిక రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి రైతుకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed