Video Viral: ఫ్రీఫైర్ గేమ్ లో సింగిల్ క్లిక్.. సర్వస్వం పోగొట్టుకున్న కుటుంబం

by Ramesh Goud |
Video Viral: ఫ్రీఫైర్ గేమ్ లో సింగిల్ క్లిక్.. సర్వస్వం పోగొట్టుకున్న కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్: ఏడేళ్ల పిల్లాడు సరదా కోసం ఆడిన ఆట.. అతడి కుటుంబం సర్వస్వం కోల్పోయేలా చేసింది. ఇటీవల కాలంలో పిల్లలు ఫోన్లకే కాక అందులో ఉన్న గేమ్ లకు సైతం బానిసలుగా మారుతున్నారు. సరదా కోసం ఆడే గేమ్‌లలో కూడా విలాసాలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేగాక ఆ గేమ్‌లలో పై స్థాయికి వెళ్లాలనే ఆశతో.. లావాదేవీలు జరిపి తల్లిదండ్రుల డబ్బు మొత్తం ఖర్చు చేసేస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టంటి చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ తండ్రి తన బ్యాంకు ఖాతాలోని డబ్బు ఏమైందని కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఆ పిల్లాడు తనకు ఏం తెలియదని, నేను ఫోన్ లో గేమ్ మాత్రమే ఆడుతున్నానని ఏడుస్తూ సమాధానం ఇచ్చాడు.

ఆ డబ్బు తమ ఇంటి ఖర్చుల కోసం పొదుపు చేసిన మొత్తం అని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి ఆ పిల్లాడు తనకు ఏం తెలియదని, ఎక్కడ ఖర్చు చేయలేదని చెప్పాడు. పక్కనే ఉన్న మరో పిల్లాడిని ప్రశ్నించగా.. ఫోన్ లో ఫ్రీఫైర్ గేమ్ (Free Fire Game) ఆడుతున్నాడని, అందులో లావాదేవీలు (Transactions) జరిపి పోగొట్టాడని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ తండ్రి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎన్నో రోజుల నుంచి కష్టపడి పొదుపు చేసిన డబ్బు మొత్తం కేవలం గంటల వ్యవధిలో తుడిచిపెట్టుకుపోవడంతో కృంగిపోయాడు. సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (viral) అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇందులో తప్పు మొత్తం పిల్లాడి తల్లిదండ్రులదేనని, అంత చిన్న పిల్లాడికి ఫోన్ ఇవ్వడమే తప్పు.. అకౌంట్ ఆక్సిస్ (Account Access) ఎందుకు ఇచ్చారని మండిపడుతున్నారు. అంతేగాక ఆన్ లైన్ గేమ్ (Online Game) లలో కొనుగోళ్లు సింగిల్ క్లిక్ (single Click) తో చేయవచ్చని, తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిందని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed