- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందుబాబులు.. మీకు బ్లాక్ అవుట్ సమస్యలు ఎందుకు వస్తుందో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: 'మద్యపానం (Alcohol) ఆరోగ్యానికి హానికరం'.. ఇది అందరికి తెలిసిందే. కానీ, సరదాగా అప్పుడప్పుడు తాగితే ఏ పర్లేదని కొందరు.. అదిచ్చే కిక్కుకు బానిసలై మరికొందరు మద్యం సేవిస్తుంటారు. అయితే, అప్పుడప్పుడు తాగినా, నిత్యం తాగినా ఆల్కహాల్ శరీరంపై విపరీతంగా ప్రభావం చూపుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు హెచ్చరించాయి. తాజాగా అమెరికాకు చెందిన డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మందుబాబుల జ్ఞాపకశక్తికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
సాధారణంగా మందు తాగినప్పుడు కొంత మంది విపరీతంగా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు గొడవలు కూడా పడుతుంటారు. కానీ, మద్యం మత్తు వదిలినా తర్వాత వారికి ఇవేం గుర్తుండవు. అలాగే, మరికొందరు స్పృహ కోల్పోతారు. ఈ పరిస్థితిని బ్లాక్ అవుట్ (Block out) అంటారు. అంటే.. తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పొవటం. ఒక వ్యక్తి మోతాదుకు మించి మద్యం సేవించినప్పుడు మెదడులోని హిప్పోకాంపస్ పని తీరుపై ప్రభావం పడుతుంది. ఇది మన జ్ఞాపకాలను భద్రపర్చుకోవటంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఆల్కహాల్ ఎక్కవైతే తాత్కాలికంగా మతిమరుపు ఏర్పడుతుంది. అయితే, బ్లాక్ అవుట్ పరిస్థితి తరచూ ఏర్పడితే శాశ్వతంగా మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని డ్యూక్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఐదు పెగ్గులంటే ఎక్కువగా మద్యం తాగితే బ్లాక్ అవుట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుదని తెలిపారు.
అలాగే, మద్యం సేవిస్తే గుండె కండరాలు దెబ్బతింటుంది. మద్యపానంతో పొట్టలో పుళ్లు ఏర్పడతాయి. దీంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. మద్యం సేవించడం వల్ల నరాల బలహీన పడుతాయి. నిద్రపట్టడం తగ్గిపోతుంది. త్రాగేవారికి ఆహార పదార్థాల, విటమిన్ల లోపాలు కూడా వస్తాయి. భయం, దృష్టి, వినికిడికి సంబంధించిన భ్రమలు వస్తుంటాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని మద్యం తాగేవారికి బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.