TG Govt.: బీఆర్ఎస్ హయాంలో నో ఫైనాన్షియల్ డిసిప్లేన్.. కాగ్ రిపోర్డులో సుస్పష్టం

by Shiva |
TG Govt.: బీఆర్ఎస్ హయాంలో నో ఫైనాన్షియల్ డిసిప్లేన్.. కాగ్ రిపోర్డులో సుస్పష్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయింది. అందినకాడికి ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ ఇష్టారీతిన అప్పులు తీసుకవచ్చిందని కాగ్ గుర్తించింది. అప్పులే కాదు ఎక్కడ ఎంత మేరకు అప్పులు, చేబదుల్లు, అడ్వాన్స్లు ప్రభుత్వానికి ఎన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయో అన్నింటిని వాడుకుంది. ఎన్నికల యేడాది కావడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని, వారిని సంతృప్తి పర్చడానికి అనేకపాట్లు పడిందని కాగ్ నివేదిక ద్వారా వెల్లడైంది. భూముల అమ్మకం, ఓఆర్ఆర్ లీజుకు ఇవ్వడం, తదితర వాటి ద్వారా విపరీతంగా ఆదాయాన్ని సముపార్జించినా కూడా అవి కూడా సరిపోకపోవడం, మరో వైపు ఎన్నికల సంవత్సరం కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, అప్పటీ కీలక మంత్రులు అప్పులపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ విధానంలో రూ.52,517 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం 321 రోజులు ఇలా తీసుకుందని, ఆర్థిక సంవత్సరం నాటికి మరోక రూ.వెయ్యి కోట్లు ఆర్బీఐ తిరిగి చెల్లించాల్సి ఉండగా చెల్లించలేకపోయిందీ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి ఆర్థిక సంవత్సరంలో 145 రోజుల్లో రూ.35,425 కోట్లు తీసుకున్నట్లుగా కాగ్ నివేదికలో ప్రకటించింది. కాగ్ నివేదికను ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2023–24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలు రూ.2.16లక్షల కోట్లు కాగా వాస్తవంగా రూ.1.69 లక్షల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చిందని కాగ్ నివేదిక వెల్లడించింది. అంచనాల్లో 78 శాతం మాత్రమేనని పేర్కొంది. ఆ ఆర్థిక సంవత్సరంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ గణనీయంగా వచ్చింది. ప్రభుత్వం ముందుగా అంచనా వేసిన దానికంటే 104 శాతం అధికంగా వచ్చినట్లుగా తెలింది. దీనితో పాటుగా అప్పులు తీసుకోవడంలో కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు నిలిచింది. అంచనాల కంటే అధికంగానే అప్పులు తీసుకున్నారు. రూ.38,234 కోట్లు అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.49,977 కోట్లు అప్పులు తీసుకున్నారు. బీఆర్ఎస్ చివరి సంవత్సరం మాత్రం నాన్ ట్యాక్స్ రెవెన్యూ మాత్రం గణనీయంగా వచ్చింది.

గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలోనూ 69 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లుగా వెల్లడించారు. రూ.1.11లక్షల కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.76773 కోట్లు వచ్చాయి. బడ్జెట్ అంచనాలకు వేతనాలు, పెన్షన్ మించిపోయాయి. వేతనాలకు 107 శాతం, పెన్షన్స్ 129 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. క్యాపిటల్ వ్యయంలోనూ అంచనాలను మించి ఖర్చు చేశారు. 117 శాతం ఖర్చు చేశారు.

45 శాతం జీతాలు, పింఛన్లు, వడ్డిలకే..

కాగ్ తన నివేదికలో ఆసక్తి కలిగించే విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 45 శాతం కేవలం ఉద్యోగుల జీతాలు, వారికిచ్చే పెన్షన్స్, అప్పుల వడ్డీలకే చెల్లిస్తున్నట్లుగా వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం నుంచి రాష్ట్రానికి 2023‌‌–24లో రూ.1,69,293కోట్లు వస్తే ఇందులో రూ.75,456కోట్లు జీతాలు, పెన్షన్స్, వడ్డీలకే వెచ్చించారు. ఇందులో వేతనాలకు రూ.34,267 కోట్లు, పెన్షన్స్ కు రూ.16,842 కోట్లు, వడ్డీలకు రూ.24,347 కోట్లు చెల్లించారు. ఇలా రాష్ట్ర ఆదాయంలో రూ.75వేల కోట్లు కేవలం ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధంలేని వాటికే వెచ్చిండం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడింది.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

జీతాలు -పెన్షన్స్ - వడ్డీలు - మొత్తం (రూ.కోట్లలో)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

2019–20 - 24,565 - 14,385 -11,834 - 50,784

2020–21 -24,770 - 16,841 -13,599 -55,210

2021–22 -30,375 -19,161 -14,025 - 63,561

2022–23 -30,963 - 21,821 -15,816 - 68,600

2023–24 - 34,267 - 24,347 -16,842 - 75,456

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

మొత్తం - 1,44,940 - 96,555 - 72,116 -3,13,611

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

రెవెన్యూ రాబడులు (వసూళ్లు):

రాష్ట్ర ఆదాయంలో రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరిగాయి. గత ఐదు సంవత్సరాల్లో ఏకంగా రూ.65వేల కోట్ల రెవెన్యూ వసూళ్లు పెరిగినట్లుగా కాగ్ నివేదిక స్పష్టం చేస్తుంది. 2019–20లో రూ.1,02,543 కోట్ల రెవెన్యూ రాబడులు ఉండగా 2023–24 నాటికి అవి కాస్తా రూ.1,69,293కోట్లుగా చేరాయి. రెవెన్యూ వసూళ్లలో ప్రధానంగా జీఎస్టీ, పన్నుల ఆదాయ వ్యయాలపై పన్నులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూలో జనరల్, సోషల్, ఎకనమిక్ సర్వీసెస్ వాటి ద్వారా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా రెవెన్యూ వసూళ్లకు ఆదాయం వస్తుంది.

గత ఐదేళ్లలో రెవెన్యూ వసూళ్లు..

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

2019–20 - 2020–21 - 2021–22 - 2022–23 - 2023–24

రెవెన్యూ వసూళ్లు - 1,02,543 -1,00,914 -1,27,468 -1,59,350 1,69,293

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

భారీగా గ్యాప్లో రెవెన్యూ వ్యయం...

రోజు వారి అవసరాలకు వెచ్చించే రెవెన్యూ వ్యయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019–20లో బడ్జెట్ అంచనా వ్యయంలో రెండు శాతం మాత్రమే గ్యాప్ ఉండగా అది 2023–24 లో 28 శాతం చేరింది. 2019–20లో రూ.2259 కోట్ల గ్యాప్ ఉంటే 2023–24లో రూ.66,017 కోట్ల గ్యాప్ ఉండటం విశేషం. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇష్టారీతిన చేయడం, అంచనాలకు తగ్గట్లుగా వాస్తవాలు ఉండకపోవడంతో ఇలాంటి అధిక వ్యత్యాసాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు.

Next Story

Most Viewed