పట్టపగలే దొంగతనం.. కాపుకాచి మరీ..!

by Aamani |
పట్టపగలే దొంగతనం.. కాపుకాచి మరీ..!
X

దిశ, మక్తల్: పట్టణంలోని న్యూ మారుతి నగర్ లో నివాసం ఉంటున్న రాజేష్ గౌడ్ ఇంట్లో గురువారం సాయంత్రం మూడు,నాలుగు గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది.ఇంట్లో ఎవరూ లేని చూసిన గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు విరగొట్టి ఇంట్లో ప్రవేశించి దాదాపు రూ. 1లక్షా ముప్పై వేల నగదును ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది.

ఈ విషయంపై బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో తో మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో విషయాన్ని తెలుసుకున్నారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్ తీసుకునేందుకు క్లూస్ టీం వారి రంగంలోకి దించి తనిఖీలు చేస్తున్నారు. అయితే బాధితుడు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం గురువారం ఉదయం రాజేష్ గౌడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఓ ఫ్లాట్ విక్రయంతో వచ్చిన పెద్ద మొత్తం డబ్బును బ్యాగులో ఉంచుకుని సంచరించడం జరిగిందని,ఈ విషాయన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు, ఆయన కదలికలను గమనించి, బాదితుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి వెళ్ళాక దానికి సంబంధించిన డబ్బులు ఇంట్లో ఉంచాడని వేతికి దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story