- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోసపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ఇంతకీ విషయం ఎంటో తెలుసా.. ?

దిశ,తల్లాడ: సోషల్ మీడియాలో ఏది నిజం ఏ అబద్దం తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏ అందమైన ప్రకటన వెనక ఏ మోసం దాగి ఉందో.. ఏ చాటింగ్ వీడియో కాల్ వెనక ఏ కుట్ర కోణం దాగి ఉందో...? కనిపెట్టడమే కష్టంగా మారిపోయింది. తాజాగా తల్లాడ మండలంలో నారాయణపురం గ్రామంలో మరో మోసం వెలుగు చూసింది. ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించవచ్చు అని ఆశపడిన యువకుడిని ఆన్లైన్ మోసగాల్లు జేబులు మాత్రం ఖాళీ చేస్తున్నారు. తల్లాడ మండలంలో వెలుగు చూసిన నయా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... టెలిగ్రామ్ లో ఈజీ మనీ సంపాదించుకోవడం ఎలా అని యువకులకు కాయిన్ గూగుల్ మ్యాప్స్ అనే అప్ ద్వారా వలవేస్తున్నారు. మీరు ఇంట్లోనే కూర్చొని రూ1.20 వేల రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు అని అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. తమను సంప్రదించిన యువకులకు చాటింగ్ ద్వారా సందేశాలు పంపించారు. ఇలా యువతను ఆకర్షించేందుకు ఆన్లైన్లో స్కాములతో కొత్త ఎత్తు వేశారు. అయితే ఈ టీంలో చేరాలంటే విడతల వారిగా డబ్బు చెల్లించాల్సిందని, మొదటగా రూ. 5వేల రూపాయల చెల్లించాలన్నారు. అలాగే రెండో విడత రూ.65వేల వరకు చెల్లించాలని ,మీకు 30% నుంచి 60% వరకు డబ్బులు కలిపి మీకు క్యాష్ బ్యాక్ చేస్తామని ఆశ చూపిస్తూ యువకులను ఆకర్షిస్తున్నారు.
బాధితుడు వివరణ..
తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సిలం.నాగ ప్రసాద్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యో గిగా నిర్వహిస్తున్నాడు. ఆ యువకుడు టెలిగ్రామ్ యాప్ లో కాయిన్స్ గూగుల్ యాప్ ద్వారా మిస్టర్ రాకేష్ టిఆర్టి అని ప్రొఫైల్ తో యువకులను ఆకర్షిస్తున్నాడు. ఈజీ మనీ ఎలా సంపాదించాలనే ఒక అప్లికేషన్ ఆన్లైన్ లో వదులుతాడు. యువకులు టెలిగ్రామ్ యాప్ లో బాధితుడు యొక్క ఐడితో ఓపెన్ చేయటం దాంట్లో సంభాషణ చాటింగ్ ద్వారా నడుస్తుంది. మీరు మనీ వేస్తే దానికి మీరు 30% శాతం నుంచి మనీ పొందొచ్చని, ఈ అవకాశం కాయిన్స్ గూగుల్ యాప్ ద్వారా మాత్రమే అని తెలుపుతారు.
అనంతరం గ్రూపులో జాయిన్ అయినా యువకుల నుంచి వారి బ్యాంక్ అకౌంట్,పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని అమౌంట్ పే చేయండి అని సంభాషణ నడుస్తోంది. ఈ అవకాశం మార్నింగ్ 8:30 నుంచి రాత్రి 7:10 దాకా అని, అనంతరం టైం ముగుస్తుందని త్వరగా త్వరపడండి అని మెసేజ్ చేస్తారు. ఆకర్షణైనా యువకులు రూ.5 వేల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయగా.. వారికి రూ 6200/- వచ్చినట్టుగా చూపిస్తుంది. అనంతరం రెండోసారి రూ. 25 వేల రూపాయలు డిపాజిట్ చేయవలసిందిగా కోరుతారు. అలా చేస్తే మీకు 30% రూ.30300వేల రూపాయలు వస్తాయని ఆశ చూపిస్తారు. అనంతరం ఆ అమౌంట్ డిపాజిట్ కావు ఏంటి అని అడిగితే మీరు ఈ సారి రూ.50వేల రూపాయలు డిపాజిట్ చేయాలని అంటారు. అనంతరం మీకు 60% ఆఫర్ మీకు ఉందని ఆశ చూపించి అమౌంట్ కాస్త వేపిచ్చుకుంటారు. ఎవరికైనా అనుమానం వస్తే ఏంటి అని అడిగితే నెంబర్ బ్లాక్ చేస్తారు. బాధితుడు వద్ద నుంచి 30,300 రూపాయలు తన అకౌంట్ నుంచి కట్ అయ్యాయని సైబర్ క్రైమ్ ద్వారా కేసు నమోదు చేశామని వారు తెలిపారు. ఏదేమైనా అన్నీ తెలిసి చదువుకున్న యువకులు యువతలు ఆన్లైన్లో మోసపోతూ ..జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా యువత మేలుకొని ఇలాంటి ఈజీ మనీ కోసం ఆశపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని కొందరు అంటున్నారు..