పోచారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

by Naveena |
పోచారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
X

దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్కేసర్ మండల రెవెన్యూ పరిధిలోని పోచారం సర్వేనెంబర్ 35 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని మంగళవారం ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈనెల 22న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన.. రెవెన్యూ యంత్రాంగాన్ని స్థానికులు కొందరు అడ్డుకున్నారు. దీంతో కూల్చివేత పనులు వాయిదా వేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున భారీ పోలీసు బందోబస్తు సాయంతో..అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రాజేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం, ఎస్సై నాగార్జున రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Advertisement
Next Story

Most Viewed