Sudha Murty: పనిగంటలపై నారాయణమూర్తి కామెంట్స్.. సుధామూర్తి రియాక్షన్ ఏంటంటే?

by Shamantha N |
Sudha Murty: పనిగంటలపై నారాయణమూర్తి కామెంట్స్.. సుధామూర్తి రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: పనిగంటలపై ఇన్ఫోసిస్ (Infosys) కో ఫౌండర్ నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, దీనిపైనే ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) స్పందించారు. ఏదైనా పనిని ఇష్టంతో, సీరియస్ గా చేయాలనుకుంటే సమయం ఎప్పుడూ పరిమితిగా మారదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీడీవీ 'ఇండియా త్రూ ది ఐస్ ఆఫ్ ఇట్స్ ఐకాన్స్' అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన భర్త డబ్బు లేకుండా, అంకితభావంతో ఉన్న సహోద్యోగులతో ఇన్ఫోసిస్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారని చెప్పకొచ్చారు. వారు 70 గంటలు లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యిందని ఆమె అన్నారు. ఇన్ఫోసిస్ ఈ స్థాయిలో ఉందేట దాని వెనక మ్యాజిక్ లేదని.. కష్టపడి పనిచేయడం వల్లే అది సాధ్యమయ్యిందని చెప్పుకొచ్చారు. ‘నా భర్త మాత్రమే కాదు.. జర్నలిస్టులు, డాక్టర్లు వంటి ఇతర రంగాల్లోని వారు కూడా 90 గంటలు పని చేస్తున్నారు. భగవంతుడు అందరికీ రోజుకి 24 గంటల సమయమే ఇచ్చాడు. దానిని మీరు ఎలా వినియోగించుకుంటారు అనేది మీ ఇష్టం’ అని సుధామూర్తి పేర్కొన్నారు.

వ్యక్తిగత జీవితం గురించి..

ఈసందర్భంగానే ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌ను చూసుకున్నప్పుడు తాను ఇంటి బాధ్యతలు తీసుకున్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంటిని చూసుకోవడం, పిల్లలను పెంచడంతో పాటు కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను తన భర్త కంటే ఓవర్‌టైమ్‌ పని చేస్తున్నానని, దానికి ఆయన వెనక నుంచి సపోర్ట్‌గా ఉండి ముందుకు నడిపిస్తున్నట్లు వెల్లడించారు. "ప్రతి విజయవంతమైన మహిళ వెనుక అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలి. మూర్తి పనిచేస్తున్నప్పుడు, నేను అతనికి మద్దతు ఇచ్చా. నేను పనిచేస్తున్నప్పుడు ఆయన మద్దతు ఇస్తున్నారు. వృత్తి జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అదే జీవితం” అని పేర్కొన్నారు. ఇకపోతే, గతంలో ఓ పాడ్ కాస్ట లో నారాయణమూర్తి మాట్లాడుతూ.. దేశం ఉత్పాదకత, ప్రపంచంలోకెల్లా అత్యల్పంగా ఉందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని పిలుపునిచ్చారు. కాగా.. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు.

Next Story

Most Viewed